ఆ ఆరు పాత్రల్లో 'పెద్ది'లోని అప్పలసూరే బెస్ట్: జగపతి బాబు

  • రామ్ చరణ్ 'పెద్ది'లోని తన పాత్రపై జగపతి బాబు వ్యాఖ్యలు
  • ఇప్పటివరకు చేసిన పాత్రల్లో అప్పలసూరి రోల్ ఉత్తమమని వెల్లడి
  • పాత్ర గెటప్ క్రెడిట్ దర్శకుడు బుచ్చి బాబుదేనన్న జగ్గూభాయ్
  • జాతీయ అవార్డు గ్రహీత రషీద్ మేకప్ గురించి ప్రస్తావన
  • జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా 'పెద్ది'లో తాను పోషించిన అప్పలసూరి పాత్ర తన కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని నటుడు జగపతి బాబు అన్నారు. నటన, గెటప్ పరంగా ఈ పాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, 'లెజెండ్' తర్వాత తాను గుర్తుపెట్టుకున్న ఆరు ముఖ్య పాత్రల జాబితాలో 'పెద్ది'లోని అప్పలసూరి పాత్రకే నంబర్ 1 స్థానం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ పాత్ర గెటప్, రూపకల్పన విషయంలో పూర్తి క్రెడిట్ దర్శకుడు బుచ్చి బాబుకే దక్కుతుందని జగపతి బాబు తెలిపారు. "జాతీయ అవార్డు గ్రహీత, మేకప్ ఆర్టిస్ట్ రషీద్ ప్రత్యేక శ్రద్ధతో ఈ లుక్‌ను డిజైన్ చేశారు. ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఈ పాత్ర అద్భుతంగా ఉండబోతోందని అర్థమైంది. రామ్ చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది" అని ఆయన వివరించారు. ఇప్పటికే జగపతి బాబు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసుకున్నారు.

ఇటీవల విడుదలైన 'పెద్ది' ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో సాగే ఈ కథలో రామ్ చరణ్ 'పెద్ది' అనే బహుముఖ ప్రతిభావంతుడైన అథ్లెట్‌గా, అద్భుతమైన ఫిజిక్‌తో కనిపించనున్నారు. చెర్రీ స‌ర‌స‌న జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Jagapathi Babu
Peddhi Movie
Ram Charan
Buchi Babu Sana
Janhvi Kapoor
Telugu Cinema
Appalasuri Character
Rural Action Drama
Shiva Rajkumar
Rashid Makeup Artist

More Telugu News